Telegu
ఏ మోసం గురించి అయినా ‘యాక్షన్ ఫ్రాడ్’ కు తెలిసేలా చేయండి
మీరు ఒక మోసానికి గురై ఉంటే, మీరు ‘యాక్షన్ ఫ్రాడ్’ – యునైటెడ్ కింగ్‌డమ్ యొక్క ఫ్రాడ్ రిపోర్టింగ్ సెంటరుకు చెప్పగలరు.మీరు యుకెలో ఉంటే, మోసం యుకెలో జరిగి ఉంటే లేక మోసానికి యుకెతో సంబంధం ఉంటే మరియు ఆన్-లైన్‌లో జరిగి ఉంటే, ఏ మోసం గురించి అయినా మీరు ‘యాక్షన్ ఫ్రాడ్’ కు రిపోర్టు చేయగలరు.
మీరు ఇంగ్లీషు మాట్లాడకపోతే లేక ఇంగ్లీషు మీ మాతృభాష కాకపోతే, మోసం గురించి మీరు మీ సొంత భాషలో మాకు చెప్పడానికి అవకాశం ఇచ్చే సర్వీసు మావద్ద ఉంది.
- ఫోను +44 300 123 2040.
- మీ కాల్‌కు ఇంగ్లీషు మాట్లాడే ఎవరో ఒకరు జవాబిస్తారు. మీరు ఏ భాష మాట్లాడుతారో వారికి మీరు చెప్పవలసి ఉంటుంది.
- అప్పుడు మిమ్మల్ని అనువాదకున్ని పిలిచేవరకు వేచి ఉండమని కోరటం జరుగుతుంది. దీనికి కొద్ది నిమిషాలు పట్టగలదు, కాబట్టి దయచేసి ఫోను పెట్టివేయకండి. తక్షణం మావద్ద అనువాదకుడు అందుబాటులో లేకపోతే, మీ ఫోను నంబరు ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరటం జరుగుతుంది మరియు అనువాదకుడు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎవరో ఒకరు మీకు వెనక్కు ఫోను చేస్తారు.
- అనువాదకుడు మీతో మాట్లాడినప్పుడు, మీ ఫ్రాడ్ రిపోర్టు తయారు చేయడానికి వీలుగా మిమ్మల్ని కొద్ది ప్రశ్నలు అడుగుతారు. మీరు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగేలా, మోసానికి సంబంధించి ఏవైనా కాగితాలను మీ చేతుల్లో ఉండేలా సునిశ్చితపరుచుకోండి.
లైన్లు తెరిచి ఉండే సమయం:
సోమవారం - శుక్రవారం ఉదయం 8 నుండి సాయంత్రం 8 వరకుశనివారం:
వరకు: +44 300 123 2040. టెక్స్ట్‌ఫోను: +44 300 123 2040.